చైనాకు మ‌రో దిమ్మ తిరిగే షాక్ ఇవ్వ‌నున్న భారత్..??

July 1, 2020 at 8:17 am

సరిహద్దులో చైనాతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. పౌరుల డేటా చోరీ, దేశ భద్రతకు విఘాతం అనే కారణాలతో చైనాకు చెందిన 59 యాప్ లను భారత ప్రభుత్వం నిషేధించి. టిక్ టాక్, హలో, యూసీ బ్రౌజర్ సహా మొత్తం 59 యాప్ లపై కేంద్రం నిషేధం ప్రకటించిన కొద్ది గంటలకే ప్లే స్టోర్ నుంచి వాటిని తొలగించారు. దీంతో డ్రాగన్‌ కంట్రీకి భారత ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చిన‌ట్టు అయింది.

అయితే భార‌త్ ఇప్పుడు చైనాకు మ‌రో దిమ్మ తిరిగే షాక్ ఇవ్వ‌నుంద‌ని తెలుస్తోంది. హువావే(Huawei ).. టెక్ రంగంలో ఈ పేరుకు పెద్ద చరిత్రే ఉంది. చైనాకు చెందిన ఈ టెక్ దిగ్గజం 5జీలో గ్లోబల్ మార్కెట్ లీడర్ అని చెప్పవచ్చు. గత ఇర‌వై సంవత్సరాలుగా ఇండియాలో తన ఉనికిని చాటుతున్న హువావేపై త్వరలోనే బ్యాన్ విధించే ఛాన్స్‌లు ఉన్నాయా అంటే.? కేంద్ర వర్గాల నుంచి అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి.

చైనా దుందుడుకుతనానికి పూర్తిగా కళ్లెం వేసేందుకు 5జీ పరికరాలపై నిషేధం విధించే అంశంపై మంత్రులు కీలక విషయాలను చర్చించారని కేంద్రవర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఇప్పటికే హువావే సంస్థపై అమెరికాలో నిషేధం కొనసాగుతోంది. హువావే అధినేతకు, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ పలు ఆరోపణలు రావడంతో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ నిషేధిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు భార‌త్‌లోనూ దీన్ని బ్యాన్ చేస్తే.. డ్రాగన్‌ కంట్రీకి గ‌ట్టి దెబ్బ త‌గులుతుంది.

చైనాకు మ‌రో దిమ్మ తిరిగే షాక్ ఇవ్వ‌నున్న భారత్..??
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts