భార‌త్ దెబ్బ‌కు వెన‌క్కి త‌గ్గిన చైనా..!!

July 6, 2020 at 1:20 pm

గ‌త నెల 15న తూర్పు ల‌ఢ‌ఖ్ స‌రిహ‌ద్దుల్లోని గాల్వ‌న్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో భార‌త్‌కు చెందిన‌ 20 మంది భారత జవాన్లు మృతి చెందిన‌ సంగతి తెలిసిందే. ఈ ఘటన మొత్తం భారత దేశాన్ని ఏకతాటి పైకి తెచ్చింది. చైనాకు వ్యతిరేక పోరు లో మోదీ ప్రభుత్వానికి ప్రజల నుంచి విపక్ష-ప్రతి పక్షాల నుంచి సపోర్ట్ దక్కింది. మ‌రియు డ్రాగన్‌ చర్యలకు భారత్ దీటుగా బదులిస్తోన్న విషయం తెలిసిందే.

ఈ ప‌రిణామాల మ‌ధ్య గాల్వన్ లోయలో చైనా తన సైనికులను కనీసం ఒక కిలోమీటర్ దూరం వెనక్కి ఉపసంహరించుకుంది. అలాగే టెంట్లు తొలగించడంతో పాటు తమ వాహనాలను కూడా వెనక్కు తీసుకువెడుతున్నాయి. కమాండర్ స్థాయి చర్చల్లో నిర్ణయించుకున్నట్లుగానే చైనా బలగాలు వెనక్కు పయనమయ్యాయి. ఈ మేర‌కు సీనియ‌ర్ ప్ర‌భుత్వ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు.

అయితే, చైనా పారదర్శకంగా వ్యవహరిస్తుందా? మళ్లీ సైన్యాన్ని ముందుకు పంపుతుందా? అన్న విషయంపై తాము దృష్టి పెడతామని భారత అధికారులు వెల్ల‌డించారు. కాగా, క‌య్యానికి కాలుదువ్వుతున్న చైనాకు బుద్ధి చెప్పేందుకు ఇప్ప‌టికే చైనా యాప్‌లను నిషేధించడంతో పాటు చైనాతో వాణిజ్య కార్యకలాపాలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటు స్వయంగా ప్రధాని మోదీ లడక్‌లో పర్యటించి సైనిక బలగాల నైతిక స్థైర్యాన్ని పెంచిన విష‌యం తెలిసిందే.

భార‌త్ దెబ్బ‌కు వెన‌క్కి త‌గ్గిన చైనా..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts