ఈషా రెబ్బాతో క‌రోనాపై మెగా సందేశం ఇచ్చిన చిరు!!

July 16, 2020 at 12:43 pm

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు చిన్నా.. పెద్ద అని తేడా లేకుండా అంద‌రూ వ‌ణికిపోతున్నారు. వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. దీనిని క‌ట్ట‌డి చేయ‌డం కూడా ప్ర‌పంచ‌దేశాల‌కు పెద్ద స‌వాల్‌గా మారింది. అయితే క‌రోనా శ‌ర‌వేగంగా విజృంభిస్తున్న వేల మాస్కు పెట్టుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి అయిపోయింది. అయితే కొంద‌రు మాత్రం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. క‌రోనాకు ఎదురెళ్తున్నారు.

అయితే ఇలాంటి స‌మ‌యంలో టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి మాస్కుల ప్రాధాన్యత గురించి తనదైన శైలిలో వివరించే ప్రయత్నం చేశారు. చిరునవ్వు ముఖానికి అందం. కానీ ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే.. మాస్క్‌ ధరించాలంటూ యువ హీరోయిన్ ఈషా రెబ్బతో కలిసి చిరు ‘మెగా’ సందేశం ఇచ్చారు.

ఇక‌ ఇప్ప‌టికే యువ హీరో కార్తికేయ‌తో క‌లిసి చిరు ఓ వీడియో సందేశం అందించారు. `మీసం మెలేయడం వీరత్వం అనేది ఒకపుడు.. కానీ ఇపుడు మాస్క్‌ ధరించడం వీరుడి లక్షణం` అంటూ చిరంజీవి ఆ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ రెండు వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. కాగా, కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరిక చేసిన నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి ఈ రెండు వీడియోల‌ను ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.

ఈషా రెబ్బాతో క‌రోనాపై మెగా సందేశం ఇచ్చిన చిరు!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts