కరోనాను జయించిన కానిస్టేబుల్ కి సిఐ పూలతో స్వాగతం

July 17, 2020 at 10:43 am

కరోనా పోలీసులను కూడా వదిలిపెట్టడం లేదు అనే సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు.. పోలీసులు నానా బాధలు పడుతున్న సంగతి తెలిసిందే. విధులు నిర్వహించాలి అంటే చాలా వరకు కూడా భయపడుతూ ఆఫీసుకి రావడం కూడా చాలా మంది మానేశారు. ఇక మరి కొంత మంది పోలీసులు మాత్రం కరోనా వైరస్ ని జయించి బయటపడుతున్నారు. తాజాగా ఒక కానిస్టేబుల్ ఇలాగే కరోనా వైరస్ నుంచి బయట పడ్డారు.

కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు భద్రత కోసం గానూ శివ కుమార్ అనే కానిస్టేబుల్ హైదరాబాద్ వెళ్ళారు. ఆయనకు మరో కానిస్టేబుల్ నుంచి కరోనా సోకింది. అతనికి కరోనా లక్షణాలు ఉండటంతో వెంటనే కరోనా పరిక్షలు చేయగా కరోనా బారిన పడినట్లు వెల్లడి అయింది. వెంటనే అతన్ని ప్రత్యేకంగా ఉంచి చికిత్స చేసారు. కుటుంబం మొత్తాన్ని క్వారంటైన్ చేసారు.

 

వైద్యంతో కరోనా వైరస్ నుంచి కోలుకుని బయటపడగా అతని సొంత స్టేషన్ అయిన బాపట్ల లో పోలీసులు పూల మాలలతో స్వాగతం పలికారు. బాపట్ల టౌన్ సీఐ బి.అశోక్ కుమార్, ఎస్ఐ హాజరతయ్య ఆయనకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి స్వాగతం పలికారు. పోలీసు సిబ్బంది అందరూ కలిసి… పుష్ప గుచ్ఛం ఇచ్చి పోలీసు స్టేషన్ లోకి ఆహ్వానించారు. అందరూ కరోనాకు భయపడవద్దు అని చెప్పడానికి ఇలా చేసామని సిఐ చెప్పారు.

కరోనాను జయించిన కానిస్టేబుల్ కి సిఐ పూలతో స్వాగతం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts