అమరావతిలో తీగ లాగుతున్న సిట్…?

July 15, 2020 at 5:39 pm

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంగా చెప్తున్న అమరావతిలో భూముల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దూకుడు పెంచింది. రాష్ట్ర రాజధానిలో అవినీతి వ్యవహారాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిన అధికారులు క్షేత్ర స్థాయిలో దూకుడుగా విచారణ చేస్తున్నారు. ఏ మాత్రం కూడా వదిలే ప్రసక్తి లేదు. ప్రత్యేక బృందం తాజాగా మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకుంది.

విజయవాడ కేంద్రంగా వ్యాపారం చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారి గుమ్మడి సురేష్ ని సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో రిటైర్ అయిన ఎమ్మార్వో హస్తం కూడా ఉందని గుర్తించిన సుదీర్ అనే మాజీ ఎమ్మార్వో ని అరెస్ట్ చేసారు. అసైన్డ్ భూముల వ్యవహారాల మీద దృష్టి పెట్టిన ఏసీబీ ఈ అరెస్ట్ లు చేసింది. సుదీర్ రాజధాని ప్రాంతంలో పత్రాలు మార్చేసినట్టు గుర్తించిన అధికారులు అరెస్ట్ చేసారు.

 

సురేష్ రాజధాని ప్రాంతంలో 40 ఎకరాలను కొన్నాడు అని విచారణలో అధికారులు తేల్చారు. వీరు ఇద్దరినీ ఇప్పుడు ప్రత్యేకంగా విచారిస్తున్నారు. గతంలో కీలక శాఖల్లో మంత్రులుగా పని చేసిన వారి హస్తం ఏమైనా ఉందా అనే దాని మీద కూడా ఆరా తీయడం మొదలుపెట్టారు. సుదీర్ ని విచారిస్తే పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. అందుకే అతన్ని ప్రత్యేకంగా విచారిస్తున్నారు.

అమరావతిలో తీగ లాగుతున్న సిట్…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts