వాట్సాప్ వాడండి… ఎమ్మెల్యేలకు సిఎం జగన్ సూచన

July 13, 2020 at 12:45 pm

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కరోనా కేసులు అధికార పార్టీ నేతలను బాగానే ఇబ్బంది పెడుతున్నాయి అనే మాట స్పష్టంగా చెప్పవచ్చు. అధికార పార్టీ నేతలకు చెందిన గన్ మెన్ లు సహా పలువురికి కరోనా సోకడం తో పాటుగా చాలా వరకు కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. ఏపీ డిప్యూటి సిఎం తో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడుతున్నారు. దీనితో సిఎం జగన్ సరికొత్త ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.

ఎమ్మెల్యేలు ఎవరూ కూడా ప్రజల్లోకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండాలి అని అదే విధంగా సిఎం ఆఫీస్ కి వచ్చే ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని కరోనా పరిక్షలు చేయించుకోవాలి, పదే పదే రావొద్దు అని ఆయన చెప్పినట్టు సమాచారం. ప్రజల్లో తిరిగే కొందరు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడటం తో సిఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తుంది. అనవసరంగా లేనిపోని ఇబ్బందులు వద్దని ఆయన సూచించారు.

 

సోషల్ మీడియాను వాడుకోవాలి అని కార్యకర్తలతో వాట్సాప్ గ్రూపుల్లో టచ్ లో ఉండాలి గాని ప్రజల్లోకి వెళ్ళవద్దు అని ఆయన చెప్పారు అని టాక్. సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించే వారు కూడా ప్రజల్లోకి వద్దు అని కొన్ని రోజుల పాటు ఇళ్లకే పరిమితం కావాలి అని ఆయన చెప్పారు అని టాక్. నలుగురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

వాట్సాప్ వాడండి… ఎమ్మెల్యేలకు సిఎం జగన్ సూచన
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts