సిఎం జగన్ కడప పర్యటన ఖరారు…!

July 3, 2020 at 6:53 pm

ఏపీ సిఎం వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన ఖరారు అయింది. ఆయన ఈ నెల 7, 8 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించడానికి సిద్దమయ్యారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని ఆయన ఆయా తేదీల్లో కడప జిల్లా పర్యటనకు వెళ్తారు. ఈ సందర్భంగా ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సిఎం జగన్ ప్రారంభించే అవకాశం ఉంది.

ఈ నేపధ్యంలో జిల్లా కలెక్టర్ సి హరి కిరణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. సిఎం కడప జిల్లా పర్యటనకు వస్తున్నారు అని ఆయన పర్యటన విజయవంతం చెయ్యాలి అని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కడప జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో హరికిరణ్‌ జిల్లాకు చెందిన కీలక అధికారులతో, ఎస్పీ అన్బురాజన్‌తో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు.

కోవిడ్‌-19 నేపథ్యంలో స్టాండర్డ్‌ ఆపరేషనల్‌ ప్రోటోకాల్‌(ఎస్‌ఓపీ) తప్పనిసరిగా పాటించాలి అని ఆయన అధికారులకు స్పష్టమైన సూచనలు చేసారు. పర్యటనలో భాగంగా ఇడుపులపాయ, ఆర్కే వ్యాలీ ట్రిపుల్‌ ఐటీలో ముఖ్యమంత్రి నిర్వహించే కార్యక్రమాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అని సూచనలు చేసారు. బందోబస్తు పరంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని ఎస్పీకి సూచనలు చేసారు.

సిఎం జగన్ కడప పర్యటన ఖరారు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts