
ఆంధ్రప్రదేశ్ లో సిఎం జగన్ ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల విషయంలో కాస్త దూకుడుగానే ఉన్నారు. ఏ విధంగా కూడా ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే ఆయన మాత్రం వెనక్కు తగ్గడం లేదు అనే చెప్పాలి. కరోనా వైరస్ ఇబ్బంది పెడుతున్నా సరే సిఎం జగన్ మాత్రం సంక్షేమ కార్యక్రమాల్లో వెనక్కు తగ్గడం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడు అది ఆలా ఉంటే…
ఈ నెల 15 న జరిగే క్యాబినెట్ భేటీ లో ఆయన కరోనాతో మరణించిన వారికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. అవును కరోనాతో మరణించిన వారికి ప్రత్యేకంగా ఒక ప్యాకేజి ఇచ్చే ఆలోచనలో సిఎం జగన్ ఉన్నారు. మరణించిన వారు పేదలు అయితే మాత్రం వారికి ఏడాది పాటు ఉచితంగా రేషన్ ఇచ్చే విధంగా సిఎం జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అదే విధంగా కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు సంబంధించి కరెంట్ చార్జీల్ల్లో కూడా కాస్త డిస్కౌంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఇక వారికీ ఆహరం సహా కొన్ని కొన్ని విషయాల్లో లోటు రాకుండా నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి మార్గదర్శకాలను జగన్ విడుదల చేసే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఏంటి అనేది చూడాలి.