108 ఉద్యోగులకు జగన్ స‌ర్కార్‌ వరాల జల్లు..!!

July 1, 2020 at 12:43 pm

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రజారోగ్యం కోసం జగన్ సర్కార్.. ఆరోగ్య శ్రీ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు-నేడుకు తోడు కొత్తగా 108, 104 అంబులెన్సులు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్ర‌మంలోనే నూతనంగా అందుబాటులోకి తెచ్చిన అత్యాధునిక అంబులెన్స్ లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఉదయం విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద జగన్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

దీంతో విజయవాడ నుంచి అంబులెన్సులు కుయ్, కుయ్ అంటూ రాష్ట్ర నలుమూలలకు తరలి వెళ్లాయి. అత్యవసర వైద్య సేవలను అందించేందుకు 1088 అంబులెన్స్ లను కొనుగోలు చేసిన ఏపీ సర్కారు, వాటిని రాష్ట్రంలోని ప్రతి మండలానికి పంపుతామని వెల్లడించింది. ఈ వాహనాల్లో 676 వాహనాలు 104 కాగా.. మరో 412 వాహనాలు 108లు. అయితే తాజాగా 108 ఉద్యోగులకు సీఎం జగన్ వరాల జల్లు కురింపించారు.

108 ఉద్యోగుల జీతాలను భారీగా పెంచారు సీఎం. 108 సర్వీసుల్లో పనిచేస్తున్న డ్రైవర్‌కు గతంలో రూ.10వేలు అయితే, ఇప్పుడు సర్వీసును బట్టి రూ.18వేల నుంచి రూ.28వేల వరకూ జీతం పెంచాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా.. ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ గతంలో రూ.12 వేల అయితే ఇప్పుడు రూ.20వేల నుంచి 30వేల వరకూ జీతం పెరగనుంది.

108 ఉద్యోగులకు జగన్ స‌ర్కార్‌ వరాల జల్లు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts