బ్రేకింగ్: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సువర్ణ అధ్యాయం:సిఎం జగన్

July 1, 2020 at 12:36 pm

ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో ప్రతిష్టాత్మకంగా భావించే గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఏపీ సర్కార్ ఆకాలజీ విభాగాన్ని ప్రారంభించింది. సిఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విభాగాన్ని ప్రారంభించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఇది అందుబాటులోకి వస్తుంది అని ఏపీ సర్కార్ ప్రకటించింది. క్యాన్సర్ చికిత్స పేద మధ్య తరగతి ప్రజలకు అందనుంది.

రూ… 50 కోట్ల వ్యయం తో ఈ విభాగాన్ని ఏపీ సర్కార్ ప్రారంభించింది. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ యుకే తరహాలో వైద్య విప్లవం గ్రామాల్లో తీసుకుని వస్తామని అన్నారు. 5 నుంచి 7 గ్రామాలకు ఒక డాక్టర్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. పేదలకు వైద్యం అందాలి అని 108 అంబులెన్స్ లు పట్టణ ప్రాంతాల్లో అయితే 15 నిమిషాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో వస్తుంది అని ఆయన వివరించారు.

కోటీ 42 లక్షల మందికి తాము ఆరోగ్య శ్రీ కార్డులు ఇచ్చామని చెప్పారు ఈ రోజు వైద్య చరిత్రలో సువర్ణ అధ్యాయం అని సిఎం అన్నారు. 104 ద్వారా వైద్య సేవలను ప్రతీ ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. గత ప్రభుత్వంలో వైద్యం దారుణంగా ఉండేది అని సిఎం పేర్కొన్నారు. ఎలుకలు కోరికేవి అని, సెల్ ఫోన్ లైట్ల తో వైద్యం చేసే వారు అని సిఎం ఆరోపించారు. ఇప్పుడు సరికొత్త మార్పులు తెస్తున్నామని అన్నారు.

బ్రేకింగ్: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సువర్ణ అధ్యాయం:సిఎం జగన్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts