ఢిల్లీ పర్యటనకు సిఎం జగన్ రెడీ…?

July 14, 2020 at 6:33 pm

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి కేసులు పెరగడమే గాని తగ్గే అవకాశాలు ఏ విధంగా చూసినా సరే కనపడటం లేదు. ఈ తరుణంలో ఆర్ధిక ఇబ్బందులు రాష్ట్రానికి పెద్ద తల నొప్పిగా మారిన సంగతి తెలిసిందే. ఆర్ధికంగా అసలే బలహీనంగా ఉన్న రాష్ట్రానికి ఇప్పుడు ఈ ఇబ్బందులు నరకం చూపిస్తున్నాయి. ఈ తరుణంలో సిఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు రెడీ అవుతున్నారు.

కరోనా పరిక్షలకు రాష్ట్రంలో చాలా వరకు ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదే విధంగా కరోనా చికిత్సకు సంబంధించి కేంద్రం ఏ మాత్రం కూడా సహకారం లేకపోయినా సరే నిధులను భారీగా ఖర్చు చేస్తూ వస్తుంది రాష్ట్రం. ఈ తరుణంలో ఆర్ధిక ఇబ్బందులు రాష్ట్రాన్ని బాగా వెంటాడుతూ ఉన్నాయి. అందుకే ఢిల్లీ వెళ్ళాలి అని సిఎం జగన్ కీలక్క నిర్ణయం తీసుకున్నారు.

 

ఈ సందర్భంగా కేంద్రం ముందు రాష్ట్ర వాస్తవ పరిస్థితిని ఉంచి ఆయన నిదులు అడగాలి అని భావిస్తున్నారు. మొత్తం ఆరుగురు కేంద్ర మంత్రులతో సమావేశం కావడానికి జగన్ రెడీ అయ్యారు అని సమాచారం. ఆరుగురు కేంద్ర మంత్రులతో పాటుగా ప్రధాని నరేంద్ర మోడీ తో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. వచ్చే వారం చివర్లో జగన్ ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది.

ఢిల్లీ పర్యటనకు సిఎం జగన్ రెడీ…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts