కీలక నిర్ణయం తీసుకున్న సిఎం జగన్…!

July 11, 2020 at 10:06 am

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడికి సిఎం జగన్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఆయన కరోనాకు సంబంధించిన చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు సలహాలు సూచనలు ఇస్తూ వస్తున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా కరోనా కేసులు పెరగడంపై ఆయన కాస్త కఠినం గానే ఇప్పుడు వ్యవహరిస్తున్నారు అనే చెప్పాలి.

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు సిఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ జిల్లాకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే కరోనా కోసం గానూ కోటి రూపాయలను ఆయన కేటాయించారు. దీనిపై కరోనా నోడల్ అధికారి కృష్ణ బాబు ఒక ప్రకటన చేసారు. కరోనా నివారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ద్రుష్టి సారించి వాటి నిర్వాహణ కోసం ప్రతి జిల్లాకి కోటి రూపాయలు కేటాయించిందని ఆయన పేర్కొన్నారు.

 

ప్రభుత్వం కేటాయించిన ఈ మొత్తాన్ని వైద్య పరికరాలు, సౌకర్యాలకు వాడతారని ఆయన శనివారం పేర్కొన్నారు. వాటి కేంద్రాలను జేసీ లు పర్యవేక్షిస్తారు అని ఆయన వివరించారు. కోవిడ్ వైద్యం కోసం సెంటర్స్ లో పడకల సంఖ్య 5 వేలకు పెంచాలని అధికారులను ఆయన ఆదేశించారు. కరోనా బాధితుల ఆహరం కోసం మనిషికి రోజుకు రూ. 500/ కేటాయిస్తున్నట్లు ఆయన వివరించారు.

కీలక నిర్ణయం తీసుకున్న సిఎం జగన్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts