సిఎం జగన్ టార్గెట్ 50 వేల పరిక్షలు…?

July 3, 2020 at 6:58 pm

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కరోనా పరిక్షలు భారీగా జరుగుతున్నాయి. కరోనా వైరస్ ని కట్టడి చేయడంలో కీలకం పరిక్షలే అనే సంగతి అన్ధైర్కి తెలిసిందే. పరీక్షలను ఎంత వేగంగా చేస్తే అంత వేగంగా కరోనా కట్టడి అవుతుంది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా పరీక్షలను మరింత వేగంగా చేయడానికి గానూ సిద్దమవుతుంది అనే వార్తలు వస్తున్నాయి. ఏపీలో 50 వేల పరిక్షలకు సిద్దమవుతున్నారు.

సిఎం జగన్ టార్గెట్ 50 వేల కరోనా పరిక్షలు అని అంటున్నారు. 50 వేలకు పైగా కరోనా పరీక్షలను చేయడానికి గానూ భారీగా ఆయుధాలను కూడా కొనుగోలు చేయడానికి ఇప్పుడు ఏపీ సర్కార్ అన్ని విధాలుగా సిద్దమవుతుంది. దీనిపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖతో కూడా ఏపీ సర్కార్ సంప్రదించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుని కొనుగోలు చేస్తారని అంటున్నారు.

రోజు రోజుకి కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కొన్ని కొన్ని జిల్లాల్లో కరోనా పరిక్షలు అవసరం అని సిఎం జగన్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. దక్షిణ కొరియా సహా జపాన్ నుంచి భారీగా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. త్వరలోనే వీటిని దిగుమతి చేసుకునే సూచనలు ఉన్నాయి.

సిఎం జగన్ టార్గెట్ 50 వేల పరిక్షలు…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts