బ్రేకింగ్:అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అండగా సిఎం జగన్…!

July 3, 2020 at 12:30 pm

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సిఎం జగన్ అండగా నిలిచారు. తాజాగా వారి కోసం ఆయన అవుట్ సోర్సింగ్ సర్వీసులు అనే కార్పోరేషన్ కి శ్రీకారం చుట్టారు. వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా సిఎం జగన్ దీనికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా 50 వేల 449 మంది ఉద్యోగులకు ఏపీ సర్కార్ నియామక పత్రాలు అందిస్తుంది. వారికి ఒకటో తేదీనే జీతం చెల్లిస్తామని సిఎం జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేసారు.

వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని గతంలో ఉద్యోగం రావాలి అన్నా సరే… జీతం కావాలన్నా సరే కచ్చితంగా లంచాలు ఇచ్చే పరిస్థితి ఉండేది అని కాని ఇప్పుడు ఆ పరిస్థితి వద్దు అని ఆయన పేర్కొన్నారు. దళారి వ్యవస్థ అనేది ఉండదు అని ఆయన స్పష్టం చేసారు. 50 శాతం మహిళలకు 50 శాతం ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఉద్యోగాలు ఇస్తామని సిఎం జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేసారు.

అదే విధంగా పాదయాత్రలో తాను అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధలను తెలుసుకున్నా అని అన్నారు ఆయన. అందుకే ఇప్పుడు ఈ వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు భాస్కర్ నాయుడు అనే వ్యక్తికి కాంట్రాక్ట్ లు ఇచ్చారు అని అతను చంద్రబాబు నాయుడు బంధువు అని జగన్ పేర్కొన్నారు. అలాంటి వ్యవస్థలు ఇక ఇప్పుడు ఉండవు అని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

బ్రేకింగ్:అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అండగా సిఎం జగన్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts