
కేసీఆర్ ఎక్కడ..?? ఈ ప్రశ్న గత రెండు, మూడు రోజులు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రగతి భవన్ ఎదుట ఇద్దరు యువకులు హల్ చల్ సృష్టించారు. ‘సీఎం కేసీఆర్ ఎక్కడ? ఆయన నా సీఎం. ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవడం నా హక్కు’ అంటూ ఆంగ్లంలో రాసి ఉన్న ఓ ప్లకార్డును ప్రదర్శించారు.
అలాగే మరోవైపు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయమైన ప్రగతి భవన్ లో 30 మంది ఉద్యోగులు పాజిటివ్ గా తేలారని, సీఎం కేసీఆర్ కూడా కరోనా కాటుకు గురై, గజ్వల్ లోని ఫామ్ హౌజ్ లో చికిత్స పొందుతున్నారంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగుతోంది. అయితే ఆ ప్రశ్నలకు, ప్రచారాలకు సీఎం కేసీఆర్ చెక్ పెట్టారు.
తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు చేరుకున్నాడు. దీంతో కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉందన్న క్లారిటీకి వచ్చింది. కాగా, గత రెండు వారాలుగా ఫామ్ హౌస్‌లో ఉన్న సీఎం.. ప్రగతి భవన్‌కి వచ్చారు. ఇక ప్రగతి భవన్‌కు చేరుకున్న కేసీఆర్ అభివృద్ధి పనులపై, కరోనా పరిస్థితులపై ఆయన అధికారులతో చర్చించనున్నారు. అలాగే ఒకటి, రెండు రోజుల్లో రైతులతో సీఎం సమావేశమయ్యే అవకాశాల ఉన్నట్లు తెలుస్తోంది.