సెంటిమెంట్ తో కొట్టిన ప్రియాంక, ప్రభుత్వం నిలబడినట్లేనా…?

July 13, 2020 at 6:09 pm

రాజస్థాన్ లో ఎలా అయితేనేం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకున్నారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి సోనియా, రాహుల్, అదే విధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ రంగంలోకి దిగారు. పార్టీ కీలక నేత, సమర్ధుడిగా గుర్తింపు ఉన్న డిప్యూటి సిఎం సచిన్ పైలెట్ తో ప్రియాంక రాహుల్ చర్చలు జరిపారు. రాహుల్ ఆయనతో దాదాపుగా పది సార్లు మాట్లాడారు.

ప్రియాంక అయితే తమకు ఉన్న అనుబంధం గురించి చిన్న నాటి నుంచి కలిసి రాజకీయాల్లోకి పైకి వచ్చిన విధానం గురించి వివరించి ఆయనను కాస్త దారిలోకి తెచ్చారు. భవిష్యత్తులో సిఎం పీఠం మీదే అని ఆమె హామీ ఇచ్చారు. మరో నేతకు ఇచ్చే అవకాశం లేదు అని ఇప్పుడు కాస్త ఓపికగా ఉండాలి అని ప్రియాంక ఆయన్ను కోరారు. తాను వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటా అని ఆమె హామీ ఇచ్చారు.

 

పార్టీ నుంచి ఏ ఇబ్బందులు ఉండవు అని సిఎం గెహ్లాట్ నుంచి కూడా ఏ ఇబ్బందులు రాకుండా తాను స్వయంగా చూసుకుంటా అని ఆమె ఆయనకు వ్యక్తిగతంగా హామీ ఇచ్చారు. దీనితో సచిన్ కూడా వెనక్కు తగ్గారు. అయితే ఆయనతో బిజెపి అగ్ర నేతలు మాట్లాడటం తో ఎం జరుగుతుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సెంటిమెంట్ తో కొట్టిన ప్రియాంక, ప్రభుత్వం నిలబడినట్లేనా…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts