ఆరు జిల్లాల్లో ఏపీలో ఇంటింటికి కరోనా పరిక్షలు…?

July 2, 2020 at 4:26 pm

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కరోనా తగ్గినట్టే తగ్గి మళ్ళీ భారీగా నమోదు అవుతున్నాయి. గత రెండు రోజులుగా తగ్గాయి అని భావించిన కరోనా కేసులు అనూహ్యంగా నేడు పెరిగే. ఏపీలో కరోనా పరిక్షలు ఇప్పుడు ఎక్కువగానే చేస్తున్నారు. ఏ రాష్ట్రం చేయని విధంగా ఏపీలో కరోనా పరిక్షలు నిర్వహిస్తున్నారు. అయినా సరే ఈ స్థాయిలో కేసులు పెరగడం చూసి షాక్ అయ్యారు ప్రభుత్వ అధికారులు కూడా.

 

రోజు 20 వేలకు పైగా పరిక్షలు చేస్తున్నారు. అయితే నేడు ఆ సంఖ్య కాస్త తగ్గింది. 14 వేల వరకే కరోనా పరిక్షలు చేసారు వైద్యులు. అయినా సరే అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నా సరే కరోనా మాత్రం ఆగడం లేదు. అందుకే ఆరు జిల్లాల్లో కరోనా పరీక్షలను ప్రతీ ఇంటికి నిర్వహించాలి అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కరోనా కట్టడి కావాలి అంటే అదే మార్గం అని సిఎం అంటున్నారు.

 

అందుకే ఇప్పుడు ఏపీలో కరోనా పరీక్షలను భారీగా పెంచే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది. మరి అది ఎంత వరకు నిజం ఏంటీ అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. దీనిపై సిఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అప్పుడు పరిక్షల సంఖ్యను పెంచే సూచనలు ఉంటాయి అని అంటున్నారు. త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఆరు జిల్లాల్లో ఏపీలో ఇంటింటికి కరోనా పరిక్షలు…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts