పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా విలయం

July 11, 2020 at 9:47 am

ఎంతో ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాల్లో ఇప్పుడు కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లాలో ప్రతీ ప్రాంతంలో ఇప్పుడు కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. గ్రామ స్థాయిలో కరోనా కేసులు ఇప్పుడు క్రమంగా పెరగడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రెండు జిల్లాల మీద దృష్టి పెట్టింది.

 

పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు లో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో తాజాగా మరో 110 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి అని ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేసులతో కలిపి జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,463కు చేరుకుంది అని అధికారులు వెల్లడించారు. ఏలూరులో 43 కేసులు నమోదు కావడం భయపెడుతుంది.

 

ఇక జిల్లాలో మరణాలు కూడా క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బారిన పడి చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక కొవ్వూరు, తాడేపల్లి గూడెం, తణుకు నియోజకవర్గాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా విలయం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts