రాచకొండ పోలీసుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోన్న క‌రోనా..!!

July 6, 2020 at 3:55 pm

క‌రోనా వైర‌స్‌.. కంటికి క‌నిపించ‌ని ఈ అతిసూక్ష్మ‌జీవి ప్ర‌పంచ‌దేశాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా అగ్ర‌రాజ్యం అమెరికా క‌రోనా దెబ్బ‌కు చిగురుటాకులా వ‌ణికిపోతుంది. ఇక మిగిలిన దేశాల్లోనూ క‌రోనా అంత‌కంత‌కూ విస్త‌రిస్తోంది. ఈ ప్రాణాంత‌క మ‌హ‌మ్మారికి వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. దీనిని క‌ట్ట‌డి చేయ‌డం పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఇదిలా ఉంటే.. క‌రోనా వైర‌స్ తెలంగాణ పోలీసుల‌కు ముచ్చెమ‌టలు ప‌ట్టిస్తోంది.

ముఖ్యంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో 53 మంది సిబ్బందికి కరోన సోకిందని సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. కరోనా సోకినవారికి వైద్యచికిత్స అందిస్తున్నామని వివ‌రించారు. కరోనా సోకిందని తెలిసినా ఎవరూ భయపడవద్దని పేర్కొన్నారు. సరైన ఆహారం, జాగ్రతలు పాటిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని సూచించారు.

అంతేకాదు, త్వరలో రాచకొండ పరిధిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లుగా సీపీ మహేష్ భగవత్ ప్రకటించారు. కాగా, తెలంగాణ‌లో రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌, మ‌ర‌ణాల సంఖ్య తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 23,902కు చేరింది. కరోనా మరణాల సంఖ్య 295కి పెరిగింది.

రాచకొండ పోలీసుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోన్న క‌రోనా..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts