బ్రేకింగ్: ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు…!

July 1, 2020 at 1:41 pm

ఆంధ్రప్రదేశ్ లో గత పది రోజులుగా భారీగా నమోదు అవుతున్న కరోనా కేసులు ఇప్పుడు కాస్త తగ్గు ముఖం పట్టాయి అనే చెప్పాలి. రోజు కూడా 700 పైగా కరోనా కేసులు రాష్ట్రంలో నమోదు అయ్యాయి. కాని పరీక్షలను చాలా వరకు వేగంగా చేయడంతో కేసులు త్వరగా బయటపడుతున్నాయి. ఇక ఏపీలో కరోనా కేసులు నేడు దాదాపు వంద వరకు తక్కువగా నమోదు కావడం హర్షించే పరిణామం.

కొన్ని జిల్లాల్లో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తుంది. గత 24 గంటల్లో ఏకంగా 28 వేల వరకు కరోనా పరిక్షలు చేసారు. వీటిల్లో 657 మందికి కరోనా వచ్చింది అని ఏపీ సర్కార్ వెల్లడించింది. వీటిల్లో ఇతర దేశాలకు చెందిన ఏడు మందికి పొరుగు రాష్ట్రాలకు చెందిన 39 మంది ఉన్నారు అని ఏపీ సర్కార్ పేర్కొంది. ఇక ఏపీలో మాత్రం 611 వరకు కరోనా కేసులు నమోదు అయ్యాయి అని ప్రభుత్వం వెల్లడించింది.

మొత్తం కరోనా కేసులు 15 వేలు దాటాయి. 15 వేల 252 మందికి కరోనా సోకింది అని ఏపీ సర్కార్ ప్రకటించింది. ఇక మరణించిన వారి సంఖ్యా 193 కి చేరుకుంది. గత 24 గంటల్లో ఆరుగురు మంది కరోనా కారణంగా మరణించారు. కృష్ణా జిల్లాలో ముగ్గురు కర్నూలు జిల్లాలో ముగ్గు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6 వేల 998 గా ఉండగా 8 వేల 71 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

బ్రేకింగ్: ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts