బ్రేకింగ్: భారత్ లో మళ్ళీ భారీగా పెరిగిన కరోనా కేసులు

July 2, 2020 at 9:50 am

భారత్ లో గత రెండు రోజుల్లో తగ్గిన కరోనా కేసులు మరోసారి భారీగా పెరిగాయి. రోజు రోజుకి కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు ఆరు లక్షలు దాటింది. రోజు రోజుకి కేసుల తీవ్రత పెరుగుతుంది గాని తగ్గడం లేదు. గత 24 గంటల్లో 19 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి దేశంలో అని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేరొంది.

 

గత 24 గంటల్లో 434 మరణాలు మరియు 19,148 కొత్త కరోనా పాజిటివ్ కేసులు భారత్ లో నమోదు అయ్యాయి అని పేర్కొన్నారు. భారతదేశంలో మొత్తం పాజిటివ్ కేసులు 6,04,641 వద్ద ఉన్నాయని కేంద్రం పేర్కొంది. వీటిలో 2,26,947 క్రియాశీల కేసులు ఉన్నాయి అని వివరించింది. దేశ వ్యాప్తంగా కరోనా నుంచి 3,59,860 మంది పూర్తిగా కోలుకున్నారు అని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.

 

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడి 17834 మంది మరణించారని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక దేశంలో కరోనా పరిక్షలు కూడా భారీగానే జరుగుతున్నాయి. జూలై 1 వరకు పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 90,56,173 అని ఐసీఎం ఆర్ పేర్కొంది. వీటిలో 2,29,588 నమూనాలను నిన్న పరిక్షించామని వివరించింది.

బ్రేకింగ్: భారత్ లో మళ్ళీ భారీగా పెరిగిన కరోనా కేసులు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts