భారత్ లో కరోనా సునామీ… 24 గంటల్లో ఎన్ని వేల కేసులంటే…!

July 4, 2020 at 10:16 am

ప్రతీ రోజు సరికొత్త రికార్డులు, ప్రతీ రోజు వేలాది కేసులు, ప్రతీ రోజు వందలాది మరణాలు, ప్రతీ రోజు పది వేలకు పైగా పెరుగుతున్న యాక్టివ్ కేసులు… ఇది దేశంలో కోరనా పరిస్థితి. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే దాని పని అది చేస్తుంది. వేగంగా వేలాది కేసులు నమోదు అవుతూ కేవలం 5 రోజుల్లోనే లక్ష కేసులు నమోదు అయ్యే విధంగా ఉంది ప్రస్తుత పరిస్థితి.

 

ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు సరికొత్త రికార్డుల దిశగా వెళ్తుంది. గత 24 గంటల్లో కరోనా కేసులు ఏకంగా 23 వేల వరకు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 22 వేల 771 కేసులు 442 మరణాలు నమోదు అయినట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య… 7 లక్షల దిశగా వెళ్తుంది.

 

6 లక్షల 48 వేల 315 మందికి మన దేశంలో కరోనా సోకింది. 18 వేల 655 మంది దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా మరణించారు. దేశంలో ప్రస్తుతం 235433 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 394227 మంది దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 61 శాతంగా ఉంది. నిన్న ఒక్క రోజే 2 లక్షల 42 వేల పరిక్షలు రికార్డ్ స్థాయిలో చేసారు.

భారత్ లో కరోనా సునామీ… 24 గంటల్లో ఎన్ని వేల కేసులంటే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts