ఏపీలో ఒక్క రోజే 39 వేల కరోనా పరిక్షలు…!

July 3, 2020 at 1:03 pm

ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత ఏ మాత్రం ఆగడం లేదు. మొన్న రెండు రోజులు కేసులు కాస్త తగ్గినా సరే ఇప్పుడు మళ్ళీ భారీగా నమోదు అవుతున్నాయి. పరిక్షలు ఎక్కువగా చేస్తే కరోనా కట్టడి అవుతుంది అని భావించినా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. ప్రతీ రోజు కూడా కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదు కావడం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవరపెడుతున్న అంశం.

గత 24 గంటల్లో మరో సారి 800 పైగా కరోనా కేసులు ఏపీలో నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 837 మందికి కరోనా సోకింది అని ఏపీ సర్కార్ వెల్లడించింది. 24 గంటల్లో కరోనా బారిన పడి 9 మంది మరణించారు అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 16 వేల 934 కి చేరుకుందని ఏపీ సర్కార్ పేర్కొంది. రాష్ట్రానికి చెందిన వారికి 789 మందికి గత 24 గంటల్లో కరోనా సోకింది.

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడి ఇప్పటి వరకు 7632 మంది కోలుకున్నారు అని ఏపీ సర్కార్ పేర్కొంది. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 9౦96 మంది కరోనాతో పోరాటం చేస్తున్నారు. 206 మంది కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు అని ఏపీ సర్కార్ పేర్కొంది. ఇక 10 లక్షల దిశగా ఏపీలో కరోనా పరిక్షలు వెళ్తున్నాయి. గత 24 గంటల్లో 39 వేల పరిక్షలు చేసారు.

ఏపీలో ఒక్క రోజే 39 వేల కరోనా పరిక్షలు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts