ఏపీలో కరోనా ఉగ్ర రూపం, మరో 1100 కేసులు…!

July 7, 2020 at 3:21 pm

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి కరోనా కేసులు వెయ్యికి పైగా నమోదు అవుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి సమర్ధవంతంగా వ్యవహరించినా సరే కరోనా కేసులు మాత్రం అదుపులోకి రావడం లేదు. ఉభయ గోదావరి జిలాల్లో కరోనా తీవ్రత చాలా అధికంగా ఉంది. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కేసులు మాత్రం ఆగడం లేదు.

ఇక తాజాగా మరోసారి ఏపీలో కరోనా కేసులు 1100 పైగా నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 16,238 మందికి కోరన పరిక్షలు చేసారు. వారిలో 1178 మందికి కరోనా సోకినట్లు వెల్లడి అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 22 మందితో పాటుగా విదేశాల నుంచి వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా నేడు 762 మంది కరోనా నుంచి కోలుకుని బయట పడ్డారు.

అయితే రికార్డ్ స్థాయిలో ఒక్క రోజే 13 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కర్నూలులో నలుగురు, అనంతపూర్‌లో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, విశాఖపట్టణంలో ఇద్దరు, ప్రకాశంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం కేసులు సంఖ్య 21,197కి చేరింది అని ఏపీ సర్కార్ తన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 252 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఏపీలో కరోనా ఉగ్ర రూపం, మరో 1100 కేసులు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts