ఇక ఏపీలో 15 నిమిషాల్లోనే కరోనా టెస్ట్ ఫలితాలు!!

July 10, 2020 at 3:53 pm

ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రాళ నృత్యం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాణాంత‌క వైర‌స్ దెబ్బ‌కు చిన్నా.. పెద్దా అని తేడా అంద‌రూ బ‌లైపోతున్నారు. వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో ఈ మ‌హ‌మ్మారి ఉధృతికి అడ్డుక‌ట్టు కూడా ప‌డ‌డం లేదు. ఇదిలా ఉంటే.. ఏపీలోనూ క‌రోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు.

తాజాగా సీఎం జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక నుంచి ఏపీలో ఎమ‌ర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం వ‌చ్చినవారు క‌రోనా టెస్ట్ ఫ‌లితం కోసం ఎక్కువ స‌మ‌యం వెయిట్ చేయాల్సిన పనిలేదు. కేవ‌లం 10 నుంచి 15 నిమిషాల్లోనే టెస్టుల రిపోర్ట్ తెలుసుకునేలా స‌ర్కార్ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందులో భాగంగా క‌రోనా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌ కిట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కిట్‌లోని స్వాబ్‌తో మొదట ముక్కులో నుంచి జిగురును పరీక్ష కోసం తీస్తారు.

దానిని కిట్‌లోని లిక్విడ్‌లో మూడుసార్లు తిప్పి, ఆ స్వాబ్‌కు అతుక్కున్న మూడు చుక్కల ద్రవాన్ని కిట్‌పై వేస్తారు. 15 నిమిషాల అనంతరం ఫలితం వెల్లడవుతుంది. కిట్‌పై రంగు మారితే కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులకు, ప్రసవాలు, ప్రమాదాల చికిత్స కోసం వచ్చిన వారికి ఈ పరీక్ష నిర్వహిస్తారు.

ఇక ఏపీలో 15 నిమిషాల్లోనే కరోనా టెస్ట్ ఫలితాలు!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts