ఏపీలో క‌రోనా విజృంభ‌ణ‌.. ఒక్క‌రోజేలోనే 845 కొత్త కేసులు..!!

July 2, 2020 at 3:04 pm

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్‌.. ప్రపంచ‌దేశాల‌ను ఏ స్థాయిలో వ‌ణికిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్‌.. ప్ర‌స్తుతం దేశ‌దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అడ్డు అదుపు లేకుండా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న క‌రోనాకు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. దీనిని క‌ట్ట‌డి చేయ‌డం పెద్ద స‌వాల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ క‌రోనా రోజురోజుకు విశ్వ‌రూపం దాల్చుతోంది.

టెస్టులు పెరిగే కొద్దీ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా భారీగానే నమోదవుతూ వస్తోంది. తాజాగా రాష్ట్రంలో 845 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 29 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో గుర్తించగా, విదేశాల నుంచి వచ్చిన వారిలో మరో 4 కేసులు వెల్లడయ్యాయి. ఫ‌లితంగా.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,097కి చేరింది.

ఇక నిన్న ఒక్క‌రోజే మరో ఐదుగురు మరణించారు. శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, అనంతపూర్, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. దీంతో మ‌ర‌ణాల సంఖ్య 198కి పెరిగింది. తాజాగా 281 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మొత్తమ్మీద రాష్ట్రంలో 7,313 మంది డిశ్చార్జి కాగా, 6,673 మంది ఆసుపత్రులలో, 1,913 మంది కొవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు.

ఏపీలో క‌రోనా విజృంభ‌ణ‌.. ఒక్క‌రోజేలోనే 845 కొత్త కేసులు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts