ఏపీలో ఆగ‌ని క‌రోనా జోరు.. 17 వేలు దాటేసిన పాజిటివ్‌ కేసులు..!!

July 4, 2020 at 3:17 pm

క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను ప‌ట్టిపీడిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అంద‌రినీ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వ్యాక్సిన్ లేని ఈ క‌రోనా చైనాలో పుట్టి.. అన‌తి కాలంలోనే దేశ‌దేశాలు వ్యాప్తిచెందింది. ఈ క్ర‌మంలోనే ల‌క్షల మంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంటోంది. ఇక ఏపీలోనూ క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. రోజురోజుకు క‌రోనా తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి.

గత 24 గంటల్లో కొత్తగా 727 కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 127 కేసులు నమోదు కాగా… కర్నూలు జిల్లాలో 118, తూర్పుగోదావరి జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి. కేసులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 32 మందికి, ఇతర దేశాల నుంచి వచ్చిన 6 మందికి కూడా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు ఏపీలో 17,699 కరోనా పాజిటివ్ కేసుల‌కు చేరుకుంది.

అలాగే నిన్న ఒక్క‌రోజే 12 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లాలో ముగ్గురు, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కడపలో ఒకరు, విజయనగరంలో ఒకరు చనిపోయినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇక ప్ర‌స్తుతం రాష్ట్ర‌వ్యాప్తంగా 9473 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 8008 మంది డిశ్చార్జ్ అయ్యారు. 218 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు.

ఏపీలో ఆగ‌ని క‌రోనా జోరు.. 17 వేలు దాటేసిన పాజిటివ్‌ కేసులు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts