ఏపీలో క‌రోనా డేంజ‌ర్ బెల్స్‌.. నిన్న ఒక్క‌రోజే 998 పాజిటివ్ కేసులు..!!

July 5, 2020 at 3:19 pm

గ‌త ఏడాది చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను తీవ్ర స్థాయిలో వ‌ణికిస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌కుండానే ల‌క్ష‌ల ప్రాణాల‌ను బ‌లితీసుకుంటోంది. దీంతో క‌రోనా పేరు వింటేనే ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి.

గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 998 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అందులో ఏపీలోని వారికి 961, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 37, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో ఒకరికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్ర‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,697కు చేరుకుంది. అలాగే నిన్న ఒక్క‌రోజే 14 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఐదుగురు మరణించగా, అనంతపురం జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కడప జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు, విశాఖ జిల్లాలో ఒకరు మృతి చెందారు. దాంతో కరోనా మృతుల సంఖ్య 232కి పెరిగింది. ఇక ప్రస్తుతం రాష్ట్ర‌వ్యాప్తంగా 10043 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. 8422 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఏపీలో క‌రోనా డేంజ‌ర్ బెల్స్‌.. నిన్న ఒక్క‌రోజే 998 పాజిటివ్ కేసులు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts