ఏపీలో క‌రోనా డేంజ‌ర్ బెల్స్‌.. నిన్న ఒక్క‌రోజే 1178 కొత్త కేసులు..!!

July 7, 2020 at 3:20 pm

గ‌త ఏడాది చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను తీవ్ర స్థాయిలో వ‌ణికిస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌కుండానే ల‌క్ష‌ల ప్రాణాల‌ను బ‌లితీసుకుంటోంది. దీంతో క‌రోనా పేరు వింటేనే ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి.

గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 1178 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అందులోఒక్క గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా 238 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అనంతపురం జిల్లాలో 153, విశాఖపట్నం జిల్లాలో 123, తూర్పుగోదావరి జిల్లాలో 112, శ్రీకాకుళం జిల్లాలో 104, కృష్ణా జిల్లాలో 100 కేసులు గుర్తించారు.

దీంతో రాష్ట్ర‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21,197కు చేరుకుంది. అలాగే మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో 13 మంది కరోనాతో మృత్యువాత పడగా, రాష్ట్రంలో మరణాల సంఖ్య 252కి పెరిగింది. ఇక ప్రస్తుతం రాష్ట్ర‌వ్యాప్తంగా 11,200 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. 9,745 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఏపీలో క‌రోనా డేంజ‌ర్ బెల్స్‌.. నిన్న ఒక్క‌రోజే 1178 కొత్త కేసులు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts