ఏపీలో క‌రోనా విజృంభ‌న‌.. నిన్న ఒక్క‌రోజే 1608 కొత్త కేసులు!!

July 10, 2020 at 3:09 pm

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో దీనిని క‌ట్ట‌డి చేయ‌డం కూడా పెద్ద స‌వాల్‌గా మారింది. ఈ క్ర‌మంలోనే ల‌క్ష‌ల ప్రాణాల‌ను హ‌రించివేస్తోంది. ఇంకెంద‌రికో ఈ వైర‌స్ సోకి నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ క‌రోనా రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి.

గత 24 గంటల్లో ఏకంగా 1608 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. ఈ కేసుల్లో రాష్ట్రానికి చెందిన వారు 1576 మంది ఉండగా, మరో 32 మంది పలు రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు, దీంతో ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 25,422కి చేరింది. అలాగే నిన్న ఒక్క రోజే మరో 15 మంది మరణించారు.

ఈ మృతుల్లో చిత్తూరు, గుంటూరు, అనంతపురం, కృష్ణా, కర్నూలు జిల్లాలో ఇద్దరు చొప్పున మరణించగా, విశాఖ, శ్రీకాకుళం, నెల్లూరు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు వదిలారు. దీంతో మ‌ర‌ణాల సంఖ్య 292కి పెరిగింది. అలాగే గత 24 గంటల్లో 981మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 13,194 నమోదయ్యింది. మరో 11,936మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని వెల్ల‌డించారు.

ఏపీలో క‌రోనా విజృంభ‌న‌.. నిన్న ఒక్క‌రోజే 1608 కొత్త కేసులు!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts