ఏపీలో క‌రోనా క‌రాళ నృత్యం.. నిన్న ఒక్క‌రోజే 1,933 కొత్త కేసులు!!

July 12, 2020 at 3:39 pm

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో దీనిని క‌ట్ట‌డి చేయ‌డం కూడా పెద్ద స‌వాల్‌గా మారింది. ఈ క్ర‌మంలోనే ల‌క్ష‌ల ప్రాణాల‌ను హ‌రించివేస్తోంది. ఇంకెంద‌రికో ఈ వైర‌స్ సోకి నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ క‌రోనా రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి.

గత 24 గంటల్లో ఏకంగా 1,933 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. ఇందులో రాష్ట్రానికి సంబంధించి 1,914 కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 18, ఇతర దేశాల నుంచి వచ్చి వారిలో ఒకరికి కరోనా సోకింది. దీంతో ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 29,168కి చేరింది. అలాగే నిన్న ఒక్క రోజే మరో 19 మంది మరణించారు.

ఈ మృతుల్లో కర్నూలు జిల్లాలో నలుగురు, శ్రీకాకుళం జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లాలో ఒకరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు కరోనాతో ప్రాణాలు విడిచారు. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా మరణాల సంఖ్య 328కి పెరిగింది. అలాగే గత 24 గంటల్లో 846మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 15,412కు పెరిగింది. మరో 13,428 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని వెల్ల‌డించారు.

ఏపీలో క‌రోనా క‌రాళ నృత్యం.. నిన్న ఒక్క‌రోజే 1,933 కొత్త కేసులు!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts