ఏపీలో క‌రోనా విశ్వ‌రూపం.. నిన్న ఒక్క‌రోజే 1908 కొత్త కేసులు!!

July 14, 2020 at 2:02 pm

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో దీనిని క‌ట్ట‌డి చేయ‌డం కూడా పెద్ద స‌వాల్‌గా మారింది. ఈ క్ర‌మంలోనే ల‌క్ష‌ల ప్రాణాల‌ను హ‌రించివేస్తోంది. ఇంకెంద‌రికో ఈ వైర‌స్ సోకి నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ క‌రోనా రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి.

గత 24 గంటల్లో ఏకంగా 1908 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 8మందికి వైరస్ సోకింది.. దీంతో మొత్తం కేసులు 1916కు చేరాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 15144కు చేరింది. అలాగే నిన్న ఒక్క రోజే క‌రోనా కార‌ణంగా మరో 43 మంది మరణించారు. ఏపీలో ఒకే రోజులో ఇంత మంది చనిపోవడం ఇదే తొలిసారి.

ఈ మృతుల్లో అనంతపూర్‌లో 10 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది, చిత్తూరు జిల్లాలో 5 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 5 మంది, కడపలో 5 మంది, కర్నూలు జిల్లాలో 3, ప్రకాశంలో 3, విశాఖలో 2, విజయనగరం జిల్లాలో ఒకరు చనిపోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా మరణాల సంఖ్య 408కి పెరిగింది. అలాగే గత 24 గంటల్లో952మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 17467 కు పెరిగింది. మరో 15144 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని వెల్ల‌డించారు.

ఏపీలో క‌రోనా విశ్వ‌రూపం.. నిన్న ఒక్క‌రోజే 1908 కొత్త కేసులు!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts