క‌రోనా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదుగా.. భార‌త్‌లో నిన్న ఒక్క‌రోజే అన్ని కేసులా..?

July 5, 2020 at 10:37 am

క‌రోనా వైర‌స్‌.. ఎక్క‌డో చైనాలో పుట్టిన ఈ వైర‌స్ ఇప్పుడు ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను త‌న గుప్పెట్లో పెట్టుకుని నానా ఇబ్బందులు పెడుతోంది. రోజుల త‌ర‌బ‌డి లాక్‌డౌన్ విధించినా.. క‌రోనా జోరు ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. దీంతో ఈ మ‌హ‌మ్మారి ఎటు నుంచి వ‌చ్చి ఎటాక్ చేస్తుందో తెలియ‌క ప్ర‌జ‌లు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాయి. ఇక భార‌త్‌లోనూ రోజురోజుకు రికార్డు స్థాయిలో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 24,850 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165కి చేరుకుంది. ఇక నిన్న ఒక్క‌రోజే 613 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మ‌ర‌ణాల సంఖ్య 19,268కి పెరిగింది. దేశంలో ఒకే రోజు అత్యధిక మరణాలు న‌మోద‌వ్వ‌డం కూడా ఇదే తొలిసారి.

ఇక ప్ర‌స్తుతం 2,44,814 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,09,083 మంది కోలుకున్నారు. కాగా, గత 24 గంటల్లో 248934 మందికి టెస్టులు చేశారు. అందువల్ల మొత్తం టెస్టుల సంఖ్య 9789066కి పెరిగింది. అయితే రికవరీల సంఖ్య 4 లక్షలు దాటడం ఒకింత ఉపశమన అంశం. కానీ, ఇప్పుడు రోజువారీ 25వేల కేసుల దాకా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

క‌రోనా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదుగా.. భార‌త్‌లో నిన్న ఒక్క‌రోజే అన్ని కేసులా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts