భార‌త్‌లో క‌రోనా క‌ల్లోలం.. 8.5 లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు!!

July 12, 2020 at 10:39 am

క‌రోనా వైర‌స్‌.. ఈ పేరు వింటేనే ప్ర‌పంచ‌దేశాలు ప్ర‌జ‌లు తీవ్ర స్థాయిలో వ‌ణికిపోతున్నారు. గ‌త ఏడాది చైనాలోని వూహాన్ న‌గ‌రంలో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్‌.. అన‌తి కాలంలోనే దేశ‌దేశాలు వ్యాప్తిచెంది అటు ప్ర‌జ‌ల‌కు, ఇటు ప్ర‌భుత్వాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. ఇక ఇప్ప‌టికే ల‌క్ష‌లాది మంది క‌రోనా కాటుకు బ‌లైపోయారు. ఇదిలా ఉంటే.. భార‌త్‌లోనూ క‌రోనా రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.

కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 28,637 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. దీంతో దేశ‌వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,49,553కి చేరుకుంది. అలాగే నిన్న ఒక్క‌రోజే 551 మరణాలు సంభవించాయి. దీంతో మ‌ర‌ణాల సంఖ్య 22,674కి పెరిగింది.

ఇక ప్ర‌స్తుతం దేశంలో 2,92,258 యాక్టివ్ కేసులు ఉండగా.. 5,34,621 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 246600 పాజిటివ్ కేసులు ఉండగా, తమిళనాడులో 134226, ఢిల్లీలో 110921, గుజరాత్‌లో 40941, కర్ణాటకలో 36216, ఉత్తరప్రదేశ్‌లో 35092 కేసులున్నాయి

భార‌త్‌లో క‌రోనా క‌ల్లోలం.. 8.5 లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts