క‌రోనా క‌రాళ నృత్యం.. నిన్న ఒక్క‌రోజే 1,87,671 పాజిటివ్ కేసులు..!!

July 5, 2020 at 8:18 am

క‌రోనా వైర‌స్‌.. ఈ పేరు వింటేనే ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు తీవ్ర స్థాయిలో వ‌ణికిపోతున్నారు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్‌.. కంటికి క‌నిపించ‌కుండా అన‌తి కాలంలోనే దేశ‌దేశాలు వ్యాపింది ల‌క్ష‌ల ప్రాణాల‌ను బ‌లితీసుకుంటోంది. ఇక గత 24 గంటల్లో 1,876,71 కేసులు రావడంతో… ప్ర‌పంచ‌వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11370247కి చేరుకుంది. అలాగే నిన్న ఒక్క‌రోజే 4462 మంది క‌రోనా కార‌ణంగా మృతి చెంద‌డంతో.. మొత్తం మరణాల సంఖ్య 532834కి పెరిగింది.

ముఖ్యంగా కరోనా మహమ్మారి దెబ్బకు అమెరికా చిగురుటాకులా వణుకుతోంది. తాజాగా నిన్న ఒక్క‌రోజే 44500 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2935088కి చేరింది. అలాగే నిన్న 249 మంది చనిపోవడంతో… మొత్తం మరణాల సంఖ్య 132313కి చేరింది. ఇక అమెరికా తర్వాత బ్రెజిల్‌లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.

అక్కడ నిన్న ఒక్క‌రోజే 35035 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 1111 మంది చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1578376కి పెరిగింది. మ‌రియు మరణాల సంఖ్య 64365కి పెరిగింది. ఇక రోజువారీ అత్యధిక కేసుల నమోదులో అమెరికా, బ్రెజిల్ తర్వాత స్థానం ఇండియాది అయ్యంది. మొత్తం మరణాల్లో ఇండియా 8వ స్థానంలో కొనసాగుతోంది. ఏదేమైనా తాజా లెక్క‌లు చూస్తేంటే క‌రోనా జోరు ఏమాత్రం త‌గ్గ‌డం లేద‌ని అర్థమ‌వుతోంది.

క‌రోనా క‌రాళ నృత్యం.. నిన్న ఒక్క‌రోజే 1,87,671 పాజిటివ్ కేసులు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts