ఏపీ మంత్రి త‌న‌యుడికి కరోనా!!

July 10, 2020 at 12:13 pm

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌రాళ నృత్యం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ మ‌హ‌మ్మారి.. కంటికి క‌నిపించ‌కుండానే దేశ‌దేశాలు పాకేసింది. ఈ క్ర‌మంలోనే అటు ప్ర‌జ‌ల‌ను, ఇటు ప్ర‌భుత్వాల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేస్తుంది. ఈ క‌రోనా భూతం బ‌య‌ట‌ప‌డేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. ఫ‌లితం లేదు.

ఇదే స‌మ‌యంలో క‌రోనా బారిన ప‌డుతున్న‌ ప్రజాప్రతినిధులు, వారి కుటంబ‌స‌భ్యుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇక తాజాగా ఏపీ మంత్రి త‌న‌యుడికి క‌రోనా సోకింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మంత్రి ధర్మాన కృష్ణదాసు కుమారుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కుమారుడికి పాజిటివ్ రావడంతో నిన్నటినుంచి మంత్రి కృష్ణదాసు హోం క్వారంటైన్‌కు వెళ్లిపోయారు.

కాగా, మంత్రి తరపున కుమారుడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ క్ర‌మంలోనే ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల‌ ఆముదాలవలసలో జరిగిన వైఎస్ జయంతి కార్యక్రమంలో మంత్రి కృష్ణదాసు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పాల్గొన్నారు. దీంతో స్పీకర్ తమ్మినేని కూడా హోం క్వారంటైన్‌కు వెళ్లిన‌ట్టు తెలుస్తోంది.

ఏపీ మంత్రి త‌న‌యుడికి కరోనా!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts