హత్యకు ఆధారాలు ఉన్నాయ్!

July 4, 2020 at 5:15 pm

ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖా మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడు భాస్కరరావు హత్య కేసుకి సంబంధించి కీలక అడుగులు ముందుకు పడుతున్నాయి. ఈ హత్యలో టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నిందితుడు అని జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు పెరోన్నారు. కొల్లు రవీంద్ర అనుచరుడు నాంచారయ్యకు భాస్కరరావు గత 6 నెలల నుంచి రాజకీయ ఆధిపత్యపోరు బాగా పెరిగిందని ఆయన మీడియాకు వివరించారు.

ఏ విధంగా అయినా సరే భాస్కరరావు ని చంపాలి అని కుట్ర చేసారు అని ఆయన పేర్కొన్నారు. భాస్కరరావు నాంచారయ్య మధ్య 7, 8 సంవత్సరాల నుంచి ఆధిపత్య పోరు ఉందన్నారు. 2013 నుంచే భాస్కరరావును చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆయన వివరించారు. చాలా సార్లు చంపడానికి ప్రయత్నించినా సక్సెస్ కాలేదని వివరించారు. గత నెల 28నే భాస్కరరావు చంపేందుకు ప్రయత్నించారని అయితే ఆరోజు కుదరకపోవడంతో 29న చంపారని అన్నారు.

హత్యకు చేయడానికి 5 రోజుల ముందు కొల్లు రవీంద్ర ఇంట్లో మర్డర్ ప్లాన్ చేసారని ఆయన పేర్కొన్నారు. ఈ హత్యలో ఎక్కడా ఎక్కడా కూడా తన పేరు రాకుండా చూడాలని కొల్లు రవీంద్ర చెప్పారని ఆయన వివరించారు. డైరెక్ట్‌గా తనకు ఫోన్ చేయొద్దని చెప్పినట్టు వివరించారు. ప్లాన్‌లో భాగంగానే నాంచారయ్య పారిపోతూ వేరే ఫోన్ నుంచి కొల్లు రవీంద్ర పీఏకు ఫోన్ చేశారని చెప్పారని పేర్కొన్నారు.

హత్యకు ఆధారాలు ఉన్నాయ్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts