అందరికి సంక్షేమం అందాలి: జగన్ స్పష్టమైన ఆదేశాలు

July 10, 2020 at 5:58 pm

ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల విషయంలో సిఎం వైఎస్ జగన్ ఏ స్థాయిలో దూకుడుగా ఉన్నారో అందరికి తెలిసిందే. ఆర్ధిక ఇబ్బందులు ఎన్ని వస్తున్నా సరే సిఎం జగన్ మాత్రం సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఏ మాత్రం కూడా వెనక్కు తగ్గడం లేదు అనే చెప్పాలి. తాజాగా ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు.

ప్రభుత్వ పథకాల ద్వారా ఇంకా లబ్ధి పొందాల్సిన వారికి త్వరగా సాయం అందేలా చర్యల తీసుకోవాలని ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. వైఎస్సార్ వాహన మిత్ర, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, కాపు నేస్తం పథకాలను గత నెలలో సిఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. వాటికీ దరఖాస్తు చేసుకోవడానికి గానూ రాష్ట్ర ప్రభుత్వం నెల రోజులు మాత్రమే గడువు ఇచ్చింది.

 

ఈ నేపధ్యంలో ఆయన అధికారులకు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసారు. దీంతో ఇంకా లబ్ధి పొందాల్సిన వారికి పథకాలను వర్తింపజేయాలని ఆయన స్పష్టం చేసారు. గతేడాది డిసెంబర్ తర్వాత మగ్గాలు ఏర్పాటు చేసుకున్న వారికి సైతం నేతన్న నేస్తం పథకాన్ని వర్తింపజేయాలని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. అందరికి కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందాలి అని ఆయన స్పష్ట౦ చేసారు.

అందరికి సంక్షేమం అందాలి: జగన్ స్పష్టమైన ఆదేశాలు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts