
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్షేత్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్న విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. పార్టీ భవిష్యత్తు ఏంటీ అనే దానిపై ఆ పార్టీ నేతల్లోనే ఒకరకమైన స్పష్టత అనేది దాదాపుగా లేదు అనే చెప్పాలి. చంద్రబాబు నాయకత్వాన్ని పార్టీ నేతలు ఎంత వరకు నమ్ముతారు అనేది కూడా ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. ఈ తరుణంలో సిఎం జగన్ పాలన కూడా ఇబ్బంది పెడుతుంది.
అయితే సిఎం జగన్ పాలనపై చంద్రబాబు నిర్వహిస్తున్న మీడియా సమావేశాలపై పార్టీ నేతలు చాలా వరకు అసహనంగా ఉన్నారు అని అంటున్నారు. అవును పార్టీ నేతలు ఇప్పుడు ఆయన తీరుపై మండిపడుతున్నారు. పార్టీ నేతలలో బాగా మాట్లాడే వారు ఉన్నా సరే ఆయన మాత్రం వరుసగా మీడియా సమావేశాలను నిర్వహిస్తున్నారు గాని ఇతర నేతలకు అసలు అవకాశం ఇవ్వడం లేదు.
ఈ మధ్య కాలంలో జూమ్ లోనే ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నారు. జూమ్ నుంచి బయటకు రావాలి అని కూడా పార్టీ నేతలు ఆయనకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఇది మంచి విధానం కాదని పార్టీలో ఇలా ఉంటే నమ్మకం ఉండదు అని ఆ పార్టీ సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జిల్లాల్లో చంద్రబాబు సైలెంట్ గా ఏ హడావుడి లేకుండా పర్యటిస్తే మినహా లాభం ఉండదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూమ్ సమావేశాలు ఆపండి బాబో అని కోరుతున్నారు.