భౌతిక దూరం సాధ్యం కాదు… మంత్రి సంచలన వ్యాఖ్యలు…

July 14, 2020 at 1:23 pm
n

తెలంగాణాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి సమర్ధవంతంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. ఈ తరుణంలో తెలంగాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణాలో ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు కరోనా బారిన పడుతున్న నేపధ్యంలో వారికి ప్రైవేట్ ఆస్పత్రిలోనే కరోనా చికిత్స చేస్తున్నారు.

ఈ తరుణంలో మంత్రి పువ్వాడ కీలక వ్యాఖ్యలు చేసారు. తనకు కరోనా వస్తే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటానని ఆయన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కాస్త ఆస్కతికరంగా మారింది. భౌతిక దూరం మన దేశంలో సాధ్యం కాదని ఆయన అబ్భిప్రాయపడ్డారు. కరోనా వస్తే వెలివేసే విధానం సమాజంలో ఉందని మంత్రి పువ్వాడ ఆవేదన వ్యక్తం చేసారు. అజయ్ అన్నారు. విపక్షాల మీద కూడా ఆయన విమర్శలు చేసారు.

 

బాధ్యత లేని కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కరోనా విషయంలో అలర్ట్ చేయడంలో కేంద్రం ఫెయిల్ అయ్యిందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అందుకే విమర్శిస్తుంది అంటూ ఆయన ఆరోపణలు చేసారు. మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, యాదగిరిరెడ్డి, గొంగిడి సునీత వంటి ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా వైద్యం చేయించుకున్నారు.

భౌతిక దూరం సాధ్యం కాదు… మంత్రి సంచలన వ్యాఖ్యలు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts