క‌రోనాతో మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి కుమారుడు..!!

July 1, 2020 at 11:57 am

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది చైనాలో పుట్టుకొచ్చిన ఈ మ‌హ‌మ్మారి అన‌తి కాలంలోనే దేశ‌దేశాలు విస్త‌రించి ల‌క్ష‌ల ప్రాణాల‌ను పొట్ట‌న‌పెట్టుకుంటోంది. ఇప్ప‌టికే వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతూపోతోంది. కోటి దాటిన కేసులు ఇంకా.. ఇంకా పెరుగుతున్నాయి. అటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది.

ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అంద‌రూ బ‌లైపోతున్నారు. సినీ సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు కూడా క‌రోనా కార‌ణంగా మృతి చెందారు. ఇక తాజాగా కేంద్ర మాజీ మంత్రి కుమారుడు ఒకరు కరోనా వైరస్ సోకి మృతి చెందారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కేంద్ర మాజీ మంత్రి బేణి ప్రసాద్ వర్మ కుమారుడు దినేష్ (40) కరోనా వైరస్‌తో మరణించారు. లక్నో నగరానికి చెందిన దినేష్ కు గత కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో వచ్చింది.

దీంతో దినేష్ ను మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు. అయితే ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దినేష్ మృతి చెందారు. కాగా, . సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడైన బేణిప్రసాద్ వర్మ ఈ ఏడాది మార్చి 27వతేదీన మరణించారు. ఇప్పుడు ఆయన కుమారుడు కరోనాతో చనిపోయాడు. బేణిప్రసాద్ వర్మ గతంలో యూపీఏ -2 ప్రభుత్వంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా పనిచేశారు.

క‌రోనాతో మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి కుమారుడు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts