కరోనాతో పోటీ పడుతున్న గోదావరి జిల్లాలు

July 7, 2020 at 6:38 pm

కరోనా వైరస్ లో గోదావరి జిల్లాలు పోటీ పడుతున్నాయి. రోజు రోజుకి రెండు జిల్లాల్లో కూడా కేసులు ఏ మాత్రం ఆగడం లేదు. కరోనా కట్టడికి సమర్ధవంతంగా ఉన్నా సరే ఈ రెండు జిల్లాలు మాత్రం కరోనా వైరస్ దెబ్బకు అల్లాడిపోయే పరిస్థితి ఏర్పడింది. కరోనా వైరస్ ని సమర్ధవంతంగా ఎదుర్కోవాలి అని జిల్లాల యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టినా సరే లాక్ డౌన్ తర్వాత పరిస్థితి మారిపోయింది.

 

రెండు జిల్లాల్లో కూడా కరోనా కేసులు 2 వేలు దాటాయి. జిల్లాలో కీలక నగరాలుగా ఉన్న రాజమండ్రి, కాకినాడ, ఏలూరు లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాజమండ్రి కాకినాడ ఏలూరు మూడు నగరాల్లో కూడా లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. అయినా సరే కేసులు మాత్రం ఈ స్థాయిలో పెరగడం భయపెడుతున్నాయి. రెండు జిల్లాల్లో మూడు నగరాలు చాలా కీలకంగా ఉన్నాయి.

 

పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు వేల 20 పైగా కేసులు ఉండగా  తూర్పు  గోదావరి జిల్లాలో ఇప్పటి వరకూ 2,147 మందికి కరోనా సోకింది. ఈ జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,442 ఉన్నాయని జిల్లా యంత్రాంగం చెప్పింది. ఒక పక్కన రెండు జిల్లాల్లో పరిక్షలు చాలా వరకు వేగంగానే చేస్తున్నా సరే కేసుల తీవ్రత మాత్రం ఏ విధంగా కూడా కట్టడి కావడం లేదు.

కరోనాతో పోటీ పడుతున్న గోదావరి జిల్లాలు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts