తెలంగాణా హైకోర్ట్ తీరుపై ప్రభుత్వం షాక్…!

July 14, 2020 at 5:29 pm

తెలంగాణాలో కరోనా పరిక్షల విషయంలో రాష్ట్ర హైకోర్ట్ గత కొన్ని రోజుల నుంచి సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా పరిక్షలు జరుగుతున్న తీరుపై గత కొన్ని రోజుల నుంచి మండిపడుతునే ఉంది. ఇక తాజాగా తెలంగాణా హైకోర్ట్ లో రాష్ట్రంలో జరుగుతున్న కరోనా పరిక్షలు అదే విధంగా వైద్యం కు సంబంధించి విచారణ చేపట్టింది రాష్ట్ర హైకోర్ట్.

 

ఈ సందర్భంగా తెలంగాణా ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అసలు కరోనా ఆస్పత్రిగా ఉన్న గాంధీ ఆస్పత్రిలో కరోనా పరిక్షలు ఎందుకు చేయడం లేదని విస్మయం వ్యక్తం చేసింది. ఆ ఆస్పత్రిలో కూడా కరోనా పరిక్షలు చేయాలి అంటూ స్పష్టం చేసింది. కేంద్రం కల్పించిన ప్రత్యేక అధికారాలాతో ప్రైవేట్ ఆస్పత్రులను నియంత్రించాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

 

కరోనా చికిత్సకు 4 లక్షల వరకు బిల్ వేసిన యశోద కిమ్స్ ఆస్పత్రులపై ఏ చర్యలు తీసుకున్నారు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. కరోనా పరీక్షలను నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో చేస్తారా లేదా అని ప్రశ్నించింది. ఈ నెల 27 లోగా నివేదిక పూర్తి స్థాయిలో ఇవ్వాలి అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అంతే కాకుండా వెంటిలేటర్లు, ఆస్పత్రి పడకల గురించి విస్త్రుత ప్రచారం చేయాలని ఆదేశించింది.

తెలంగాణా హైకోర్ట్ తీరుపై ప్రభుత్వం షాక్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts