ఇక‌పై హైస్కూళ్లలోనే ఇంటర్‌.. జ‌గ‌న్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం??

July 14, 2020 at 11:04 am

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌జ‌లంద‌రూ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. క‌రోనా నుంచి ఎలా ర‌క్షించుకోవాలా అని నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇక మ‌రోవైపు క‌రోనా కారణంగా విద్యాసంస్థ‌లు కూడా మూత‌ప‌డిని విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు మ‌రియు ఇత‌రిత‌న ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేశారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ క‌రోనా విజృంభిస్తున్న కార‌ణంగా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్దు చేసింది. అయితే తాజాగా జ‌గ‌న్ స‌ర్కార్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న హైస్కూళ్లను జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వ‌హించ‌గా.. అందులో పదో తరగతి పాసైన చాలా మంది ఇంటర్‌ చదివేందుకు ఎందుకు ఉత్సాహం చూపడం లేదన్న అంశం చర్చకు వచ్చింది.

ఈ సమస్య దూరభారం వల్లే వస్తోందని ఆ సమావేశంలో వారు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో మండల స్థాయిలోనే ఇంటర్ కాలేజీలు ఏర్పాటు చేస్తే అడ్మిషన్లను గణనీయంగా పెంచొచ్చని ఉన్నాతాధికారులు భావించారు. ఇందుకు జ‌గ‌న్ కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ముఖ్యంగా మండల కేంద్రంలోని హైస్కూళ్లను ఇంటర్‌‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేయనున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక‌పై హైస్కూళ్లలోనే ఇంటర్‌.. జ‌గ‌న్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం??
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts