చైనాకు చుక్కలు చూపించడానికి రెడీ అవుతున్న భారత్…!

July 2, 2020 at 7:17 pm

భారత్ చైనా సరిహద్దుల్లో క్రమంగా వాతావరణం హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు చైనాను ఎదుర్కోవాలి అంటే భారత్ కి ఆయుధ సంపత్తి అనేది చాలా అవసరం. సాంకేతికత విషయంలో చైనా చాలా దేశాల కంటే ముందు ఉంటుంది అనే సంగతి అందరికి తెలిసిందే. అందుకే ఇప్పుడు భారత్ కూడా తన అమ్ముల పొదిలో బలమైన ఆయుధాలను సిద్దం చేస్తుంది. చైనా సరిహద్దున ఉన్న రష్యా నుంచి భారత్ యుద్ద విమానాలను కొనుగోలు చేస్తుంది.

21 మిగ్-29, 12 ఎస్‌యు-30 ఎంకేఐ యుద్ధ విమానాలు త్వరలోనే మన దేశానికి రావడానికి సిద్దంగా ఉన్నాయి. భారత రక్షణ రంగానికి చెందిన డిఏసీ… వీటి కొనుగోలుకి ఆమోదం కూడా తెలపడంతో ఇవి త్వరలోనే భారత్ కి రానున్నాయి. మన దగ్గర ప్రస్తుతం ఉన్న 59 మిగ్-29 యుద్ధ విమానాలను కూడా ఆధునీకరించే విధంగా ఒప్పందం చేసుకుంది భారత రక్షణ శాఖ.

మిగ్-29 యుద్ధ విమానాల కొనుగోలు, ఆధునికీకరణకు 7418 కోట్ల రూపాయలు భారత్ చెల్లిస్తుంది. ఎస్‌యు-30 ఎంకేఐ యుద్ధ విమానాల కోసం 10730 కోట్లను రష్యాకు చెల్లిస్తారు. ఇక ఇదిలా ఉంటే ఈ ఆయుధాల కొనుగోలుకు సంబంధించి నేడు జరిగిన రక్షణ శాఖ మంత్రి ఆధ్వర్యంలోని సమావేశంలో 38, 900 కోట్ల రూపాయలను కేటాయించడానికి రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

చైనాకు చుక్కలు చూపించడానికి రెడీ అవుతున్న భారత్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts