మ‌రో 89 యాప్‌లు బ్యాన్.. భార‌త ఆర్మీ షాకింగ్ నిర్ణ‌యం!!

July 9, 2020 at 8:58 am

ఇటీవ‌ల గాల్వాన్ లోయలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందడంతో దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే డిమాండ్ ఊపందుకుంది. అయితే స‌రిహ‌ద్దులో నెల‌కొన్న‌ ఉధృతి ప‌రిస్థితుల నేప‌థ్యంలో.. భార‌త ప్ర‌భుత్వం టిక్‌టాక్ సహా 59 చైనా యాప్స్‌ని బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో, చైనాకు గట్టి సందేశం ఇచ్చిందని స్పష్టమవుతోంది. అయితే ఇప్పుడు ఇదే బాట‌లో ఇండియ‌న్ ఆర్మీ కూడా న‌డిచింది. ఫేస్ బుక్‌తో స‌హా మొత్తం 89 యాప్‌ల‌పై నిషేధం విధించింది. నిషేధించిన 89 ర‌కాల యాప్‌ల నుంచి ఆర్మీ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఇందుకు సంబంధించి భార‌త ఆర్మీ 89 యాప్‌ల జాబితాను విడుద‌ల చేసింది.

ఆర్మీ సూచించిన యాప్స్ జాబితాలో చైనాకు చెందిన యాప్స్‌తో పాటు ఫేస్ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్ చాట్, డైలీ హంట్‌, షేర్ ఇట్, ట్రూకాల్, ప‌బ్ జీ, టిండ‌ర్ వంటి యాప్స్ కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఆర్మీలో ప‌ని చేస్తున్న సైనికులు జులై 15వ తేదీలోగా నిషేధించిన యాప్‌ల అకౌంట్స్‌ను తొల‌గించాల‌ని ఆదేశాలు కూడా జారీ చేసింది.

మ‌రో 89 యాప్‌లు బ్యాన్.. భార‌త ఆర్మీ షాకింగ్ నిర్ణ‌యం!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts