పేదలకు ఇల్లు కట్టలేదు గాని ఇంద్ర భవనం కట్టుకున్నారు: జోగి రమేష్

July 7, 2020 at 4:44 pm

ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాలను మరోసారి వాయిదా వేయడం ఏమో గాని ఇప్పుడు అధికార విపక్షాల నేతల మధ్య మాటల యుద్ధం మాత్రం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఇళ్ళ పట్టాలను అడ్డుకోవడాన్ని వైసీపీ నేతలు భరించలేకపోతున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసలు పేదలు అంటే టీడీపీకి ఎందుకు అంత కోప౦ అని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు.

 

అసలు చంద్రబాబు నాయుడు తన హయాంలో ఒక్క ఇల్లు అయినా కట్టించాడా అని నిలదీశారు. 30 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వడానికి శ్రీకారం చుట్టామని ఆయన పేర్కొన్నారు. ఇళ్ళ పట్టాల విషయంలో విపక్ష టీడీపీ నేతలు సైంధవ పాత్ర పోషిస్తున్నారన్నారు. ఏపీలో పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టలేదు గాని ఏపీలో మాత్రం హైదరాబాద్ లో మాత్రం ఇంద్ర భవనం కట్టుకున్నారు అని ఆయన ఆరోపించారు.

 

ఇళ్ళ పట్టాలకు వ్యతిరేకంగా హైకోర్ట్ లో నాలుగు పిటీషన్ లు వేసారు అని మండిపడ్డారు. ఇల్లు కట్టలేదు గాని టిడ్కో ద్వారా 3 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళారు అని… 4300 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారన్నారు. ఇళ్ళ పట్టాలను అసలు ఎందుకు అడ్డుకున్నారు అనేది టీడీపీ నేతలు సమాధానం చెప్పాలి అని జోగి రమేష్ ఈ సందర్భంగా టీడీపీ నేతలను డిమాండ్ చేసారు.

పేదలకు ఇల్లు కట్టలేదు గాని ఇంద్ర భవనం కట్టుకున్నారు: జోగి రమేష్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts