వికాస్ ఇంత మూర్కుడా…?

July 14, 2020 at 9:47 am

ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో జరిగిన ఈ నెల 3 న జరిగిన ఎన్కౌంటర్ కి సంభందించి ఇప్పుడు విచారణ వేగవంతం చేసారు. ఈ కాల్పుల్లో 8 మంది పోలీసులు స్పాట్ లోనే మరణించారు. ఈ కాల్పుల్లో మరణించిన పోలీసులకు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు వెల్లడి అయ్యాయి. డీఎస్పీ దేవేంద్ర మిశ్రాపై వికాస్ ముఠా సభ్యులు నాలుగుసార్లు కాల్పులు జరిపారు అని వెల్లడి అయింది.

 

మూడు బుల్లెట్ లు అతని శరీరం నుంచి వెళ్ళాయి. ఓ బుల్లెట్ తలలో నుంచి, మరో బుల్లెట్ ఛాతీ, మరో రెండు బుల్లెట్లు కడుపులో నుంచి వెళ్ళాయి అని అధికారులు వెల్లడించారు. కాల్పులు జరిగిన అనంతరం డీఎస్పీ కాలు నరికేసి అతని తలను కూడా తప్పించారు. అందరిని కూడా పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చారు అని అధికారులు పేర్కొన్నారు.

 

ప్రతీ ఒక్కరికి తల ముఖంపై కాల్పులు జరిపారు అని వెల్లడించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసిన పోలీసులు కూడా భయపడ్డారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి సిట్ ని కూడా అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ సిట్ బిక్రూ గ్రామ ప్రజలను విచారిస్తుంది. వారిని అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ కాల్పులకు ఎవరు అయినా గ్రామస్థలు సహకరించారా అనే దానిపై ఆరా తీస్తున్నారు.

వికాస్ ఇంత మూర్కుడా…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts