ఉద్యోగుల కోసం జగన్ కీలక నిర్ణయం…?

July 11, 2020 at 6:32 pm

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఉద్యోగుల విషయంలో కాస్త జాగ్రత్త పడాలి అని సిఎం జగన్ భావిస్తున్నారు. ఉద్యోగుల్లో వయసు మీద పడిన వారిని ఇక కొంత కాలం పాటు విధులకు దూరంగా ఉంచే ఆలోచన చేస్తున్నారు సిఎం జగన్. ఏపీలో కరోనా కేసులు ఉద్యోగులకు కూడా సోకుతున్నాయి. వారు ప్రజలతో సంబంధం ఉన్న నాయకులు కాబట్టి ఇబ్బంది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అందుకే ఇక ఏపీలో ఉద్యోగుల విషయ౦లో 55 ఏళ్ళు దాటిన వారిని కరోనా ప్రభావం తగ్గే వరకు దాదాపు ఆరు నెలల పాటు దూరంగా ఉంచే ఆలోచనలో సిఎం జగన్ ఉన్నారని కథనాలు వస్తున్నాయి. పోలీసులు సహా రెవెన్యూ ఉద్యోగులు వైద్య శాఖ అధికారుల సేవలకు కొంత కాలం బ్రేక్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారు సిఎం. మహారాష్ట్రలో ఇలాగే ఆలోచించి పోలీసులను విధులకు దూరంగా ఉంచారు.

 

ఏపీలో కూడా ఉద్యోగుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది అని లేకపోతే అనవసరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అని ఆయన ఇప్పటికే ఉన్నతాధికారుల వద్ద వ్యాఖ్యానించారు అని సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులు చాలా వరకు కూడా ఇప్పుడు విధుల్లోకి వచ్చే వారు జాగ్రత్తగానే ఉన్నారు. ఇక ఇప్పుడు వారి ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని జగన్ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఉద్యోగుల కోసం జగన్ కీలక నిర్ణయం…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts