ఏజెన్సీ ప్రాంతాలపై సిఎం జగన్ ప్రత్యేక దృష్టి

July 14, 2020 at 6:18 pm

ఏజెన్సీ ప్రాంతాల్లో కరోనా కేసులు పెరిగితే కట్టడి చేయడం అనేది చాలా కష్టం అనే విషయం తెలిసిందే. సమర్ధవంతంగా ఎన్ని చర్యలు చేపట్టినా సరే ఒక్కసారి గ్రామ స్థాయిలో అది కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో కేసులు వస్తే మాత్రం ప్రజల్లో భయాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఏపీ సర్కార్ ఏజెన్సీ ప్రాంతాల్ల మీద ప్రత్యేక దృష్టి సారించింది అనే వార్తలు వస్తున్నాయి.

ఏజెన్సీ గ్రామాల్లో తాత్కాలికంగా కరోనా కోసం గానూ ఆస్పత్రులను ఏర్పాటు చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. పశ్చిమ గోదావరితో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏజెన్సీ లకు సంబంధించి కరోనా వైద్యానికి గానూ ఇప్పుడు ఆస్పత్రులను ఏర్పాటు చేసి ప్రత్యేక వైద్య కమిటీ ని నియమించాలి అని సిఎం జగన్ భావిస్తున్నారు. ఏజెన్సీ లో కేసులు తక్కువగానే ఉన్నాయి ప్రస్తుతం.

 

కాని పెరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అవ్వాలి అని భావిస్తుంది. వారిని పట్టణ ప్రాంతాలకు తరలించి చికిత్స అందించడం కష్టం అని భావిస్తున్న సిఎం వైఎస్ జగన్ ఇప్పుడు ప్రత్యేక నిధులను కూడా కేటాయించాలి అని భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే ఆయన వైద్య ఆరోగ్య శాఖతో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఏజెన్సీ ప్రాంతాలపై సిఎం జగన్ ప్రత్యేక దృష్టి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts